ఈ సీజన్ లో తొలిసారి... శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కదిలిన కృష్ణమ్మ!
- శ్రీశైలంకు 95 వేల క్యూసెక్కుల నీరు
- దిగువకు 33 వేల క్యూసెక్కులు
- సాగర్ కుడి కాలువకు నీరు విడుదల
- నిండుకుండల్లా తెలంగాణ జలాశయాలు
దీంతో నాగార్జున సాగర్ కు సుమారు 25 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో కుడి కాలువకు నీటిని విడుదల చేయగా, రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. కుడి కాలువకు గత రాత్రి నీటి విడుదలను ప్రారంభించగా, బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి కారంపూడి హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు ప్రకాశం జిల్లా వైపు పరుగులు పెడుతోంది.
కాగా, మరోవైపు తెలంగాణలోని చిన్న, మధ్య తరహా జలాశయాల్లోకి భారీ వరద వచ్చి చేరడంతో, అన్నీ నిండుకుండల్లా మారాయి. కిన్నెరసాని, కొమురం భీమ్, తాలిపేరు, కడెం ప్రాజెక్టుల గేట్లన్నింటినీ అధికారులు ఎత్తి వేశారు. ఎల్లంపల్లి నుంచి దిగువకు 2.89 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. కడెం నుంచి 61 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళుతోంది. గుమ్మడివల్లి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.