రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu on a two day visit to Delhi
  • రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం 
  • జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస
  • తొలి రోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరు
  • రెండో రోజు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం
  • 11వ తేదీ రాత్రికి తిరిగి అమరావతికి రాక
సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు.

మరుసటి రోజు గురువారం నాడు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశం ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 9.00 గంటలకు అమరావతి చేరుకుంటారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Delhi Visit
NDA Meeting
NITI Aayog Governing Council
Andhra Pradesh CM
Bharat Mandapam

More Telugu News