చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్, మాధవ్

NDA Meetinmg under Chandrababu Pawan Kalyan and PVN Madhav attended
  • ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం
  • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
  • రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై వేడుకలకు సన్నాహాలు
  • కార్యక్రమాల కార్యాచరణపై నేతల మధ్య కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై భాగస్వామ్య పక్షాల నేతలు దృష్టి సారించారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కీలక నేతలు సమావేశమై దీనిపై చర్చించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై నేతలు ప్రధానంగా చర్చించారు. వేడుకల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు ఉండాలని ఈ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.  

ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్టు సమాచారం.
Advertisement
NDA Meeting
Chandrababu
Pawan Kalyan
PVN Madhav

More Telugu News