భారత్‌లో అడుగుపెట్టిన అమెరికా విదేశాంగమంత్రి... ఇరాన్ చురక

Marco Rubio India Visit Iran Jibe
  • భారతీయల నుంచి సభ్యత నేర్చుకోవాలని వ్యాఖ్య
  • భారతీయులలో మర్యాద కనిపిస్తుందన్న ఇరాన్
  • ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం పోస్టు
భారతీయుల నుంచి సభ్యత, మర్యాద నేర్చుకోవాలని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియోకు ఇరాన్ సూచించింది. నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం మార్కో రుబియో ఢిల్లీకి చేరుకున్న సమయంలో, ఇతరులతో (ఇతర దేశాలతో) ఎలా మెలగాలో భారతీయుల నుంచి నేర్చుకోవాలని ఇరాన్ చురక అంటించడం గమనార్హం. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రుబియో మన దేశంలో పర్యటిస్తున్నారు.

ఆయన భారత్‌లో అడుగు పెట్టిన నేపథ్యంలో, ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టింది. భారతీయులలో సభ్యత కనిపిస్తుందని, భారత్‌లో పర్యటిస్తున్న మీరు వారి నుంచి కొంచెమైనా నేర్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

తన పర్యటనలో భాగంగా మార్కో రుబియో మొదట కోల్‌కతా చేరుకున్నారు. అక్కడి మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని, సేవాతీర్థ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో సమావేశం కానున్నారు.
Go Back to Shorts
Marco Rubio
US Secretary of State
India visit
Iran
Jaishankar
Narendra Modi
India Iran relations

More Telugu News