అమెరికా దిగ్బంధనం... సూపర్ ట్యాంకర్ భారత్ చేరుకుందని హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ ట్వీట్

అమెరికా దిగ్బంధనం... సూపర్ ట్యాంకర్ భారత్ చేరుకుందని హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ ట్వీట్

New Iranian oil shipment arrives in India despite blockade
  • 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో 'డోర్నా' దక్షిణ తీరానికి చేరుకుందని వెల్లడి
  • అమెరికా హర్మూజ్ దిగ్బంధనానికి ముందే ఇరాన్ నుంచి బయలుదేరిందని వెల్లడి
  • విజయవంతంగా భారత్ చేరుకున్నట్లు పేర్కొన్న ఇరాన్ కాన్సులేట్
2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో కూడిన సూపర్ ట్యాంకర్ 'డోర్నా' భారత దక్షిణ తీరానికి చేరుకుందని హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది. అమెరికా నావికాదళం హర్మూజ్ జలసంధిని దిగ్బంధించినప్పటికీ ముడి చమురుతో కూడిన ఈ ట్యాంకర్ విజయవంతంగా భారత్ చేరుకుందని పేర్కొంది. అమెరికా దిగ్బంధనానికి కొద్దిసేపటి ముందే ఇరాన్ జలాల నుంచి ఇది బయలుదేరిందని పేర్కొంది.

ఇదిలా ఉండగా, అమెరికా ఆంక్షలు, నావికాదళం గస్తీ నడుమ కూడా వారం రోజుల వ్యవధిలో భారత్‌కు మూడు విడతల్లో దాదాపు 6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు వచ్చింది. ప్రస్తుతం దక్షిణ తీరానికి చేరుకున్న డోర్నా నౌక సమీపంలోని స్థానిక రిఫైనరీకి సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురును అందజేయనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Iran Consulate Hyderabad
America
Iran
India

More Telugu News