నియోజకవర్గాల పునర్విభజన... 543 నుంచి 850కి పెరగనున్న లోక్ సభ స్థానాలు

Delimitation Bill Lok Sabha Seats to Increase from 543 to 850
  • ఈ నెల 16న పార్లమెంటులో పునర్విభజన, మహిల్ రిజర్వేషన్ బిల్లులు
  • బిల్లులకు సంబంధించి ఎంపీలకు సమాచారం
  • రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు సీట్లు పెరిగే అవకాశం
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 16న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చింది. బిల్లులకు సంబంధించిన ప్రతులను పంపించింది.

పునర్విభజన బిల్లు ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశముంది. దీనితో లోక్ సభ స్థానాలు 543 నుంచి 850కి చేరవచ్చని అంచనా ఉంది. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని భావిస్తోంది.

సీట్ల పెంపు తర్వాత దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి. జనగణన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా రిజర్వేషన్ ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్ సభ, అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Delimitation Bill
Lok Sabha Seats
Parliament
India Elections 2029
Constituency Reshuffle
Women's Reservation Bill

More Telugu News