నేటి బంగారం, వెండి ధరలు ఇవిగో!
గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు, నేడు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి.
నేటి బంగారం ధరలు (10 గ్రాములు):
24 క్యారెట్ల బంగారం: రూ. 1,800 తగ్గి రూ. 1,49,130 వద్దకు చేరుకుంది.
22 క్యారెట్ల బంగారం: రూ. 1,650 తగ్గి రూ. 1,36,700 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ, వెండి ధర వరుసగా నాలుగో రోజు కూడా స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,55,000గా ఉంది.
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఇన్వెస్టర్లు నష్టాల భయంతో తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం లేదా విక్రయించడమే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.