రికార్డు స్థాయికి భారత్ విదేశీ మారక నిల్వలు.. ఒక్క వారంలోనే 45 బిలియన్ డాలర్ల జంప్
- మొత్తం నిల్వలు 785.71 బిలియన్ డాలర్లు
- ఎఫ్‌సీఏ నిల్వలు 648.17 బిలియన్లకు డాలర్లకు పెరిగిన వైనం
- 2.594 బిలియన్ డాలర్లకు తగ్గిన బంగారం నిల్వలు
- మార్చి నుంచి 94.599 బిలియన్ డాలర్లు
- ఏడాదిలో ఫారెక్స్ నిల్వలు 87.438 బిలియన్ డాలర్లు
భారత్ విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి చేరాయి. సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో ఏకంగా 44.90 బిలియన్ డాలర్లు పెరిగి 785.71 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం వెల్లడించింది.
అంతకుముందు ఆగస్టు 28తో ముగిసిన వారంలోనూ విదేశీ మారక నిల్వలు 11.47 బిలియన్ డాలర్లు పెరిగి 740.80 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వరుసగా రెండో వారంలోనూ భారీగా నిల్వలు పెరిగాయి.
మొత్తం నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్‌సీఏ) భారీగా పెరిగాయి. వారంలో 47.498 బిలియన్ డాలర్లు పెరిగి 648.17 బిలియన్ డాలర్లకు చేరాయి. మార్చి చివరితో పోలిస్తే ఎఫ్‌సీఏ నిల్వలు 95.886 బిలియన్ డాలర్లు పెరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 63.692 బిలియన్ డాలర్ల మేర అధికంగా ఉన్నాయి.
అయితే బంగారం నిల్వలు మాత్రం 2.594 బిలియన్ డాలర్లు తగ్గి 113.816 బిలియన్ డాలర్లకు చేరాయి. అయినప్పటికీ ఏడాది క్రితంతో పోలిస్తే బంగారం నిల్వలు 23.517 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉన్నాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) 4 మిలియన్ డాలర్లు తగ్గి 18.806 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్‌లో భారత్ రిజర్వ్ పొజిషన్ మాత్రం 2 మిలియన్ డాలర్లు పెరిగి 4.916 బిలియన్ డాలర్లకు చేరింది.
మార్చి చివరి నుంచి చూస్తే దేశ విదేశీ మారక నిల్వలు ఏకంగా 94.599 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఏడాది క్రితంతో పోలిస్తే 87.438 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. ఈ స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉండటం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో ఒడుదొడుకులు, బాహ్య ఆర్థిక షాక్‌లను ఎదుర్కొనేందుకు భారత్‌కు బలమైన రక్షణగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.