Tapir Gao: ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ సేఫ్ కాదు: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Tapir Gao says Delhi is not safe for Northeast people
  • జాతి వివక్ష, దాడుల ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ
  • బలమైన, చట్టపరమైన చట్రాలు అవసరమన్న బీజేపీ ఎంపీ
  • అట్రాసిటీ లాంటి చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రజలకు ఢిల్లీ సురక్షితం కాదని ఆయన అన్నారు. దేశ రాజధానిలో జాతి వివక్ష, దాడుల సంఘటనలు ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని అన్నారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన ప్రజల రక్షణకు బలమైన చట్టపరమైన చట్రాలు అవసరమని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంతోపాటు బీజేపీ ప్రభుత్వం ఉన్న దేశ రాజధానిలో ఈశాన్య ప్రజలపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షత చూపడంతోపాటు దాడులు జరుగుతున్నాయని అన్నారు.  ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఈశాన్య ప్రాంతాల ప్రజలు జాతి వివక్ష, దాడులు, హత్యలను ఎదుర్కొంటున్నారని వాపోయారు. కేంద్ర హోంమంత్రిని కలిసి అట్రాసిటీ లాంటి చట్టాన్ని తీసుకురావాలని కోరతామని తపిర్ గావో అన్నారు.
Tapir Gao
BJP MP
Arunachal Pradesh
Northeast India
Delhi
Racism
Atrocity Law
Northeast People

More Telugu News