సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని రిస్క్ వద్దు: వీడియో షేర్ చేసి సజ్జనార్ హెచ్చరిక
- లైకుల కోసం యువత జీవితాన్ని రిస్క్ చేయవద్దని హితవు
- రైలు నుంచి వేలాడుతూ రీల్ చేస్తుండగా స్తంభం ఢీకొని యువకుడి మృతి
- ఈ వీడియోను షేర్ చేసి హెచ్చరిక చేసిన సజ్జనార్
"సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని తపన పడే వారికి ఇదో హెచ్చరిక. నడుస్తున్న రైలుకు వేలాడుతూ చేసే ఈ స్టంట్లు చూస్తుంటే ప్రాణం మీద తీపి కంటే ఫోన్లో వచ్చే లైకుల మీద ఆశ ఎక్కువైపోయినట్టుంది. ఇలాంటి తెలివితక్కువ పనుల వల్ల ఆ యువకుడికి దక్కింది ఏంటి? కేవలం ఆసుపత్రి బెడ్ లేదా అంతిమయాత్రే కదా. మీ పిచ్చి విన్యాసాలకు ప్రాణం పోయే వరకు ఆగుతారా? ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వాళ్ల గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించారా? లైకుల కోసం లైఫ్ రిస్క్ చేసేంత పిచ్చి వద్దు. ప్రాణం పోయాక ఆ రీల్స్ ఎవరూ చూడరు. మీ కుటుంబం మాత్రం జీవితాంతం కన్నీళ్లు పెడుతుంది" అని హితవు పలికారు.