హత్య కేసులో నిందితులకు శిక్ష... కోర్టులోనే న్యాయమూర్తికి బెదిరింపులు

Bijnor Court Convicts Threaten Judge After Murder Sentence
కారుతో ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులకు న్యాయమూర్తి శిక్ష విధించగా, వారు బెదిరింపులకు పాల్పడిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నోర్‌లో జరిగింది. మీ ఇల్లు ఎక్కడో తెలుసునని, విడిచిపెట్టేది లేదని ఇద్దరు నిందితులు బెదిరించగా, ప్రభుత్వం జడ్జికి అదనపు భద్రత కల్పించింది.

2024లో ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసుపై బిజ్‌నోర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి జస్టిస్ నిజేంద్ర కుమార్ విచారణ జరిపారు. నిందితులుగా తేలిన జైదీప్, పింటూ చౌహాన్‌లకు ఆయన జీవిత ఖైదు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి ప్రకటన చేయగానే నిందితులు ఇద్దరు ఆగ్రహంతో ఊగిపోయారు. మీ ఇల్లు ఎక్కడో తెలుసంటూ బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేశారు. నిందితులు బెదిరించిన నేపథ్యంలో న్యాయమూర్తికి అదనపు భద్రత కల్పించినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంగ్రామ్ సింగ్ వెల్లడించారు.
Go Back to Shorts
Bijnor Court
Bijnor
Uttar Pradesh
Judge Nijendra Kumar
Murder Case
Life Imprisonment
Threats to Judge

More Telugu News