అమరావతి నిర్మాణ రుణాలపై కీలక విషయాన్ని వెల్లడించిన కేంద్రం
- అమరావతి నిర్మాణానికి రుణాలు ఏపి అప్పుల పరిధిలోకి రావని పేర్కొన్న కేంద్ర ఆర్ధిక శాఖ
- అమరావతి రుణాలపై లోక్ సభలో వైసీపీ సభ్యుడి ప్రశ్న
- లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిధిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు తెలిపింది.
ఈ మేరకు లోక్ సభలో వైసీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.