సమాచారాన్ని లీక్ చేసిన 20 మంది ఉద్యోగులపై ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా వేటు

Meta Fires 20 Employees For Leaking Internal Information
కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన ఇరవై మంది ఉద్యోగులను ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తొలగించింది. ఈ ఇరవై మంది ఉద్యోగులు సంస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ ఉద్దేశంతో సమాచారాన్ని లీక్ చేసినా అది కంపెనీ విధానాలకు విరుద్ధమని మెటా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇటీవల కంపెనీలో దర్యాఫ్తును చేపట్టామని, దాంట్లో 20 మంది ఉద్యోగులు దోషులుగా తేలారని, వారు కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు తెలిసిందని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.

ఈ అంశానికి సంబంధించి త్వరలో మరికొంతమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. సంస్థకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన అంశాన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని, లీకులు జరిగినట్లు గుర్తిస్తే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Meta
Mark Zuckerberg
Employees

More Telugu News