జార్జియాలో 11 మంది భారతీయుల మృతి
- పనిచేస్తున్న రిసార్ట్ లోనే దారుణం
- విషవాయువులే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
- స్థానికుడితో కలిపి మొత్తం 12 మంది దుర్మరణం
గుడౌరీలోని రిసార్ట్ లో ఈ నెల 14న మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, గాయాల ఆనవాళ్లు కానీ లేవని చెప్పారు. సిబ్బంది కోసం కేటాయించిన గది రిసార్ట్ రెండో అంతస్తులో ఉందని, దాని పక్కనే జనరేటర్ ఉందని వివరించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్ ను ఆన్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఎలా విడుదలైందనే వివరాలు కానీ, సిబ్బంది మరణాలకు కచ్చితమైన కారణం కానీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. సిబ్బంది మరణానికి కారణం గుర్తించేందుకు దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు.