ఓటీటీ సెంటర్ కి మలయాళ క్రైమ్ థ్రిల్లర్!

Kattalan Movie Update
  • అడవి నేపథ్యంలో నడిచే 'కాటాలన్'
  • జూన్ లో థియేటర్లకు వచ్చిన సినిమా
  • ఈ నెల 13 నుంచి మొదలైన స్ట్రీమింగ్
  • కీలకమైన పాత్రలో కనిపించే సునీల్

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు .. ఇన్వెస్టిగేటివ్ సినిమాలను తెరకెక్కించడంలో మలయాళ దర్శకులు మరింత ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. ఇక అడవి నేపథ్యంలోని కథలను ఆవిష్కరించడంలో తమ నైపుణ్యానికి మరింత పదునుపెడుతూ ఉంటారు. అలా వాళ్లు రూపొందించిన సినిమానే 'కాటాలన్'. పూర్తిగా అడవి చుట్టూ తిరిగే కథ ఇది. పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 28వ తేదీన థియేటర్లకు వచ్చింది.

థియేటర్స్ వైపు నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ రోజు (ఆగస్టు 13) నుంచి 'మనోరమా మ్యాక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆంటోని వర్గీస్ .. సునీల్ .. దుషారా విజయన్ .. కబీర్ దుహాన్ సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి రవి బస్రూర్ నేపథ్య సంగీతాన్ని అందించడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. భారీతనం .. ఫారెస్ట్ లొకేషన్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా కనిపిస్తాయి. 

దట్టమైన అడవిని నమ్ముకుని అక్కడి గిరిజనులు బ్రతుకుతుంటారు. మారి వాళ్లను నమ్మించి .. ఆ అడవిలోని ఏనుగులను చంపేసి వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తుంటాడు. తన అక్రమ వ్యాపారానికి ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తున్న 'ఎడ్డీ'ని కట్టడి చేయడం కోసం, 'పెపే'ను రంగంలోకి దింపుతాడు. అడవికీ .. అడవి బిడ్డలకు మారి వలన జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించిన 'పెపే' ఏం చేస్తాడు? అందుకోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? అనేది కథ. 

Advertisement
Antony Varghese
Katalan Movie
Manorama Max OTT
Sunil Actor
Malayalam Crime Thriller
Ravi Basrur

More Telugu News