సీడ్ యాక్సెస్ రోడ్డు.. నూతన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన చంద్రబాబు
- అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
- 21.77 కిలోమీటర్ల పొడవైన సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- బకింగ్‌హామ్ కెనాల్‌పై 4 వరుసల స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాజధాని కనెక్టివిటీని బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం రూ.1,519 కోట్ల భారీ వ్యయంతో 21.77 కిలోమీటర్ల పొడవున, 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్ల రహదారిగా దీనిని రూపొందిస్తున్నారు.
విజయవాడ-మంగళగిరి హైవేను అనుసంధానిస్తూ బకింగ్‌హామ్ కెనాల్‌పై 478 మీటర్ల పొడవునా నూతనంగా నిర్మించిన 4 వరుసల స్టీల్ బ్రిడ్జిని కూడా సీఎం ప్రారంభించారు. ఇది రాజధాని ప్రాంతానికి రాకపోకలను మరింత సులభతరం చేయనుంది.
సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన 9 టవర్లలోని 216 క్వార్టర్ల పనులన్నీ (ఇంటీరియర్స్ సహా) పూర్తయ్యాయి. అధికారులు వీటికి సంబంధించిన తాళాలను సీఎం చంద్రబాబు నాయుడికి అందజేయనున్నారు.