జైల్లో మాజీ ఎంపీ ఫోన్‌లో 90 పోర్న్‌ వీడియోలు, మహిళల ఫొటోలు.. ఎలా వచ్చాయి?

Prajwal Revanna phone in jail found with 90 porn videos and women photos
  • ప్రజ్వల రేవణ్ణ బ్యారక్‌లో దొరికిన ఫోన్‌లో 80-90 పోర్న్‌ వీడియోలు
  • తక్కువ దుస్తుల్లో ఉన్న మహిళల ఫొటోల కటింగ్స్‌ కూడా ఉన్నట్లు సమాచారం
  • ఫోన్‌, పెన్‌డ్రైవ్‌, ఛార్జర్‌ను స్వాధీనం చేసుకున్న సీసీబీ అధికారులు
  • ఫోరెన్సిక్‌ పరీక్షలకు ఫోన్‌
  • ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివేట్‌ అయిన సిమ్‌
అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు చెందిన బ్యారక్‌లో దొరికిన మొబైల్‌ ఫోన్‌లో భారీగా పోర్న్‌ కంటెంట్‌ ఉన్నట్లు సమాచారం. బెంగళూరులోని అగ్రహార కేంద్ర కారాగారంలో సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో ఈ ఫోన్‌ బయటపడింది. అందులో సుమారు 80 నుంచి 90 పోర్న్‌ వీడియోలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ ‘ఇండియా టుడే’ వెల్లడించింది. తక్కువ దుస్తుల్లో ఉన్న మహిళల ఫొటోలకు సంబంధించిన వార్తాపత్రిక కటింగ్స్‌ కూడా ఫోన్‌లో ఉన్నట్లు సమాచారం.

ఈ ఫోన్‌లో ఎక్కువగా భారతీయ పోర్న్‌ వీడియోలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫోన్‌ను అధికారులు ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. వీడియోలు ఎప్పుడు డౌన్‌లోడ్‌ అయ్యాయి? ఫోన్‌ను ఎవరు ఉపయోగించారు? అందులో మరిన్ని ఫైళ్లు ఉన్నాయా? అనే అంశాలను ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించనున్నారు.

సీసీబీ అధికారులు జైలులో నాలుగు నుంచి ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించారు. హైప్రొఫైల్‌ ఖైదీల బ్యారక్‌లతో పాటు హై సెక్యూరిటీ జైలులోనూ తనిఖీలు చేశారు. రేవణ్ణ బ్యారక్‌లో మొబైల్‌ ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌, ఛార్జర్‌ కూడా లభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఇతర నిషేధిత వస్తువులేవీ దొరకలేదని పేర్కొన్నారు.

ఫోన్‌ బయటపడటంతో జైలు అధికారులపై చర్యలు మొదలయ్యాయి. నిషేధిత ఫోన్‌ జైలులోకి ఎలా చేరింది? బ్యారక్‌లోకి ఎలా వెళ్లింది? అనే అంశాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. 

ఫోన్‌లోని సిమ్‌ వినియోగంపైనా అధికారులు దృష్టి పెట్టారు. రేవణ్ణ ఫోన్‌లోని ఎయిర్‌టెల్‌ సిమ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివేట్‌ చేసినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో యాక్టివేట్‌ చేసిన సిమ్‌లు జైలు సిగ్నల్‌ జామర్లను తప్పించుకుని పనిచేస్తున్నట్లు ఇటీవల ఫోన్‌ స్వాధీనం చేసుకున్న ఘటనల్లో గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Advertisement
Prajwal Revanna
Parappana Agrahara Jail
Porn videos in jail
Central Crime Branch CCB
Mobile phone in prison
JDS former MP case

More Telugu News