మలయాళ హారర్ థ్రిల్లర్: విముక్తి పొందిన ప్రేతాత్మ సృష్టించే విలయం!
- మలయాళ సినిమాగా 'అరూపి'
- ప్రధానమైన పాత్రలో నేహా చావ్లా
- పగబట్టిన ప్రేతాత్మ చుట్టూ తిరిగే కథ
- రేపటి నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి
హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి చాలామంది ఇష్టపడతారు. ఒంటరిగా చూడటానికి భయపడేవారు, గుంపుగా ఆ సినిమాను చూసే అవకాశం వెయిట్ చేస్తారు తప్ప, చూడకుండా మాత్రం ఉండరు. అందువల్లనే ఓటీటీలలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న మలయాళ సినిమానే 'అరూపి'. నేహా చావ్లా ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది.
ప్రదీప్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకి, అభిలాష్ వారియర్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జులై 2వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. నేహా చావ్లా గ్లామర్ .. ఆమె అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే నేపథ్య సంగీతం కూడా ఎక్కువ మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 14వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ .. ఆహా వంటి ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది.
ప్రాచీన కాలంలో .. ఒక రాజవంశంపై ఒక యక్షిణి పగబడుతుంది. ఆ యక్షిణి ప్రేతాత్మను కొంతమంది మాంత్రికులు ఒక చెక్కబొమ్మలో బంధిస్తారు. ఆ చెక్క బొమ్మను ఒక రహస్య ప్రదేశంలో దాచేస్తారు. ఆ తరువాత చాలా కాలం గడిచిపోతుంది. పాడుబడిన రాజభవనంలో దొంగలు పడతారు. వాళ్లు దోచేస్తున్న సమయంలోనే చెక్కబొమ్మ క్రింద పడిపోయి పగిలిపోతుంది. పగతో రగిలిపోతూ నిద్రాణమైన స్థితిలో ఉన్న ప్రేతాత్మ, ఒక్కసారిగా బయటికి వస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ.