క్యాబ్ బుక్ చేస్తున్నారా? ముందే టిప్ అడిగితే ఇక ఇవ్వొద్దు!
- క్యాబ్ బుకింగ్‌కు ముందు టిప్ అడగొద్దని కేంద్రం ఆదేశం
- టిప్‌తో క్యాబ్ త్వరగా దొరుకుతుందన్న భావన కల్పించొద్దని స్పష్టీకరణ
- ఉబర్, ఓలా సహా అన్ని అగ్రిగేటర్లకు ఆదేశాలు
- రైడ్ పూర్తయ్యాక టిప్ ఇచ్చేందుకు మాత్రం అనుమతి
- టిప్ మొత్తం డ్రైవర్‌కే చెందాలని కేంద్రం స్పష్టీకరణ
క్యాబ్ బుక్ చేసే ముందు ‘టిప్ ఇస్తారా?’ అని అడిగే విధానానికి కేంద్రం చెక్ పెట్టింది. ఉబర్, ఓలా సహా క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ప్రయాణం ప్రారంభానికి ముందే టిప్ ఇచ్చేలా ప్రాంప్ట్‌లు చూపించొద్దని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఆదేశించింది.
క్యాబ్ త్వరగా దొరకాలన్నా, డ్రైవర్ బుకింగ్ అంగీకరించే అవకాశం పెరగాలన్నా అదనంగా డబ్బు చెల్లించాల్సిందేనన్న భావన ప్రయాణికుల్లో కలగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని అగ్రిగేటర్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వెంటనే సమీక్షించి మార్పులు చేయాలని ఆదేశించింది.
ఇటీవల కొన్ని క్యాబ్ యాప్‌లలో ‘అడ్వాన్స్ టిప్’, ‘చూజ్ యాడ్-ఆన్’, ‘త్వరగా రైడ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని పెంచుకోండి’ వంటి సందేశాలు కనిపించినట్లు నివేదికలు వచ్చాయి. దీంతో టిప్ చెల్లిస్తే క్యాబ్ త్వరగా దొరుకుతుందా? డ్రైవర్ రైడ్‌ను అంగీకరించే అవకాశం పెరుగుతుందా? అన్న సందేహాలు తలెత్తాయి.
2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం.. రైడ్ పూర్తయ్యే ముందు టిప్ అడగడం లేదా అదనపు చెల్లింపుతో క్యాబ్ లభ్యత, డ్రైవర్ కేటాయింపు, వేచి ఉండే సమయం లేదా సేవా నాణ్యతపై ప్రభావం ఉంటుందన్న భావన కలిగించడం నిబంధనలకు విరుద్ధం.
అయితే టిప్ ఇవ్వడాన్ని ప్రభుత్వం నిషేధించలేదు. ప్రయాణం పూర్తయ్యాక ప్రయాణికుడు తన ఇష్టంతో డ్రైవర్‌కు టిప్ ఇవ్వొచ్చు. అలా ఇచ్చిన మొత్తం పూర్తిగా డ్రైవర్‌కే చెందాలి. అందులో అగ్రిగేటర్ ఎలాంటి మొత్తాన్ని మినహాయించకూడదు.
ఈ విధానంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీపీపీఏ) గతంలోనే క్యాబ్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదేశాలతో ఈ నిబంధన మరింత స్పష్టమైంది.