'మహాన్యూస్' వంశీకృష్ణకు లీగల్ నోటీసులు పంపిన విజయసాయిరెడ్డి
- ఇటీవల విజయసాయిరెడ్డిపై మీడియాలో కథనాలు
- కొన్ని చానళ్లపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న విజయసాయి
- 'మహాన్యూస్' వంశీ కృష్ణ తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
తప్పుడు ఉద్దేశాలతో, నిరాధార వార్తలు ప్రసారం చేశారని, తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు. వంశీ కృష్ణ తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
అతడు చేసిన ఘోరాతి ఘోరమైన తప్పిదానికి క్షమాపణలు చెప్పకపోతే, అందుబాటులో ఉన్న తదుపరి చట్టబద్ధ మార్గాలను తాను ఎంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.