కాంగ్రెస్ నేతల కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన సోనియా... రాహుల్, ప్రియాంక విడుదల

Sonia Gandhi arrives at police station for Congress leaders Rahul and Priyanka released
  • నీట్ వివాదంపై ఢిల్లీలో కాంగ్రెస్ భారీ నిరసన
  • ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ అరెస్ట్
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
  • రాహుల్‌, ప్రియాంకలను కాసేపటికే విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు
  • నీట్ అంశంపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం అంగీకారం
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థులపై లాఠీచార్జి అంశాలతో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఆందోళన చేస్తూ పోలీసుల నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలను కలిసేందుకు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే, భద్రతా కారణాల రీత్యా ఆమెను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక, తదితర నేతలను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాహుల్ ను ఛత్రసాల్ స్టేడియం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

కాసేపటి తర్వాత రాహుల్ గాంధీని ఛత్రసాల్ పీఎస్ ను విడుదల చేశారు. అటు, ప్రియాంక, దీపేందర్ హుడా తదితర నేతలను మందిర్ మార్గ్ పీఎస్ నుంచి విడుదల చేశారు. 

మంగళవారం మధ్యాహ్నం తర్వాత, నీట్ పరీక్షలో అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్, మిత్రపక్షాల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిని నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
Sonia Gandhi
Rahul Gandhi
Priyanka Gandhi
NEET paper leak protest
Congress Delhi protest
Mandir Marg police station

More Telugu News