కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన.. భయానక పరిస్థితిని వివరించిన కంగనా రనౌత్
- పార్లమెంట్ వైపు నిరసనకారుల దూకుడుతో ఉద్రిక్తత
- ఓ భవనంలో తనను లోపల పెట్టి తాళం వేశారని చెప్పిన కంగనా
- ఒక దశలో వారు మాపై దాడి చేస్తారేమోనని భయపడ్డామన్న కంగనా
దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిరసనల నేపథ్యంలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితులను బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ వివరించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో, తాను ఉన్న భవనానికి అధికారులు తాళం వేశారని ఆమె తెలిపారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె, నిరసనకారుల తీరు చూసి పలువురు ఎంపీలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.
నిరసనకారులు పార్లమెంటు ముట్టడికి ర్యాలీగా తరలివచ్చిన సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని ఆమె పేర్కొన్నారు. "మీరు కూడా లోపలే ఉన్నారు కదా.. ఆ సమయంలో అందరూ ఎంతగా భయపడ్డారో గమనించే ఉంటారు. భద్రతా కారణాల దృష్ట్యా గేట్లు మూసివేయడంతో ఎంపీలందరూ లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. సభ వాయిదా పడినప్పటికీ మేము బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నిరసనకారులు మాపై దాడి చేస్తారేమోనన్న భయం ఒక దశలో కలిగింది" అని కంగనా చెప్పుకొచ్చారు.
ఆందోళనకారులను అదుపు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించిన ఢిల్లీ పోలీసులను ఆమె ప్రశంసించారు. "ఢిల్లీ పోలీసుల పనితీరు అభినందనీయం. వారు మాకు కవచంలా నిలిచి, నిరసనకారుల దాడులను ఎదుర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించారు. వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని ఆమె అన్నారు.
నీట్ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. నిరసనకారులు పార్లమెంట్ వైపు మార్చ్‌కు ప్రయత్నించడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సరిగ్గా అదే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.