అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబంలో ముగ్గురి మృతి

Severe road accident in USA Three members of Hyderabad family killed
  • అమెరికాలోని కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం
  • నవీద్ భార్య, కుమార్తె, కుమారుడు మృతి
  • తీవ్రంగా గాయపడిన నవీద్, చిన్నకూతురు
అమెరికాలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద వార్త తెలియడంతో వారి బంధువర్గం, తెలుగు ఎన్నారై సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక అధికారులు, భారత రాయబార కార్యాలయం అధికారులు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ఐఎస్ సదన్ డివిజన్‌ పరిధిలోని వాణి నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ నవీద్ గతంలో నగరంలోని ఒక ప్రముఖ ఫార్మా ల్యాబ్‌లో పని చేశారు. ఇటీవల అమెరికాలోని మెర్క్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆయన తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో నవీద్ భార్య నజియా (45), కుమార్తె హఫీజా షేక్ (19), కుమారుడు హఫీజ్ ఒమర్ (14) మృతి చెందారు. నవీద్‌తో పాటు ఆయన చిన్న కూమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో బంధువులు, కుటుంబ సభ్యులు నవీద్ నివాసానికి చేరుకున్నారు.
Advertisement
Sheikh Abdul Naveed
US road accident
Hyderabad family death USA
California car crash
Yakutpura family accident

More Telugu News