నేటి బంగారం, వెండి ధరలు: ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..
- నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- కిలో వెండి ధర రూ.100 తగ్గుదల
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,44,230
బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నాటికి దేశీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో పెరుగుదల నమోదు కాగా, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు:
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,230గా ఉంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,210కి చేరింది. అదేవిధంగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,170 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, గుంటూరు వంటి ఇతర నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.2,40,100గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో రేట్లు:
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. చెన్నై, ముంబై, కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,230గా ఉండగా, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,380, అలాగే 22 క్యారెట్ల ధర రూ.1,32,360గా ఉంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,280గా నమోదైంది.
బంగారం, వెండి ధరలు రోజులో పలుమార్లు మారుతుంటాయి. కాబట్టి, వినియోగదారులు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి నిర్ధారించుకోవడం శ్రేయస్కరం.