BRS: మాజీ మంత్రి పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌లపై స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

BRS complaints against pocharam and Sanjay Kumar
షార్ట్స్‌లో చూడండి
మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయన ఈ-మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా వారిపై ఫిర్యాదు చేశారు. వారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.  

ఈ నేపథ్యంలో, పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన సభ సెక్రటరీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఇదివరకు పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై కూడా ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
BRS
G Jagadish Reddy
Congress

More Telugu News