Advertisement

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు.. నేరం ఒప్పుకున్న డేవిడ్ వార్నర్!

David Warner pleads guilty in drunk driving case
  • డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్ డేవిడ్ వార్నర్
  • సిడ్నీ కోర్టులో నేరాన్ని అంగీకరించిన వార్నర్ తరఫు న్యాయవాది
  • తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహించడం ముఖ్యమని వ్యాఖ్య
  • ఆగస్టు 18న వార్నర్‌కు శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో చిక్కుకున్నాడు. సిడ్నీలోని ఓ కోర్టులో అత‌ని తరఫున న్యాయవాది హాజరై, నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ కేసులో ఆగస్టు 18న కోర్టు అత‌నికి శిక్ష ఖరారు చేయనుంది.

వివరాల్లోకి వెళితే.. కొన్ని నెలల క్రితం వార్నర్ ఒక వ్యాన్ నడుపుతూ, పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాండమ్ టెస్టింగ్ సైట్‌కు కొద్ది దూరంలో వాహనాన్ని ఆపాడు. అనుమానంతో పోలీసులు అత‌నికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలింది. దీంతో అత‌డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ కేసు విచారణకు వార్నర్ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. అత‌ని తరఫు న్యాయవాది బాబీ హిల్ కోర్టులో హాజరై, 'మిడ్ రేంజ్' డ్రింక్ డ్రైవింగ్ నేరాన్ని అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి బాధ్యత వహించడం ముఖ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయినా సరే, ఈ ప్రమాదం ఎవరికైనా పొంచి ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వార్నర్ ఆస్ట్రేలియా దేశవాళీ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Advertisement
David Warner
Sydney Thunder
Big Bash League
Drink Driving Case
Sydney Court
Australian Cricket

More Telugu News