ఉద్యోగాల సృష్టిలో విశాఖ టాప్.. మెట్రోయేతర నగరాల్లో అగ్రస్థానం
- లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడి
- ఈ జాబితాలో విశాఖ తర్వాత లుథియానా, సూరత్, వడోదర, ప్రయాగ్‌రాజ్
- సంప్రదాయ పరిశ్రమలతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లోనూ వృద్ధి
- పెరిగిన పోటీ నేపథ్యంలో చిన్న నగరాలు కొత్త అవకాశాలు అందిస్తున్నాయని వెల్లడి
భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోయేతర నగరాల జాబితాలో విశాఖపట్నం మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఉద్యోగాల కల్పన, వలసల విషయంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ 'లింక్డ్ఇన్' నేడు విడుదల చేసిన నివేదికలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో విశాఖ తర్వాత లుథియానా, సూరత్, వడోదర, ప్రయాగ్‌రాజ్ వరుసగా టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం.. ఒకప్పుడు కేవలం సంప్రదాయ పరిశ్రమలకే పరిమితమైన ఈ నగరాలు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, తయారీ, విద్య, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో వస్తున్న పెట్టుబడులతో సరికొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి. దీంతో ఈ నగరాలు బహుళ రంగాల జాబ్ మార్కెట్లుగా రూపాంతరం చెందుతున్నాయని నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఏడాది సుమారు 72శాతం నిపుణులు కొత్త ఉద్యోగం కోసం చురుగ్గా వెతుకుతున్నారని, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో నైపుణ్యాల అంతరం పెరగడం, పోటీ ఎక్కువవడంతో ఉద్యోగ వేట కష్టతరంగా మారిందని 76శాతం మంది భావిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2022 ఆరంభంతో పోలిస్తే ప్రస్తుతం ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తుదారుల సంఖ్య రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న నగరాలు సొంత ప్రాంతాలకు దగ్గరగా విభిన్నమైన కెరీర్ అవకాశాలను అందిస్తున్నాయి.
ఈ విషయంపై లింక్డ్ఇన్ కెరీర్ నిపుణురాలు నీరజితా బెనర్జీ మాట్లాడుతూ.. "ఈ నగరాల్లోని సంప్రదాయ పరిశ్రమలకు ఇప్పుడు టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటివి తోడవుతున్నాయి. ఉద్యోగార్థులు మెట్రో నగరాలను దాటి ఆలోచించాలి. ఏ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయో, మీ నైపుణ్యాలు ఏయే పరిశ్రమలకు సరిపోతాయో చూసుకోవాలి" అని సూచించారు.
విశాఖపట్నం తన సంప్రదాయ బలాలుగా ఉన్న పోర్టు, ఫార్మా, తయారీ రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, టెక్నాలజీ రంగాల్లోనూ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని నివేదిక వివరించింది. అదేవిధంగా లుథియానాలో స్టీల్, ఏవియేషన్, సూరత్‌లో స్టార్టప్‌లు, రియల్ ఎస్టేట్, వడోదరలో టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొంది.