‘సమాధానం చెప్పాల్సింది లాఠీలతో కాదు’.. కాక్రోచ్ పార్టీ ర్యాలీకి కేటీఆర్ మద్దతు
- విద్యార్థులపై పోలీసు చర్యలను ఖండించిన కేటీఆర్
- ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉందని వ్యాఖ్య
- విభేదాల గొంతు నొక్కే ప్రయత్నం ఆపాలంటూ కేంద్రానికి చురకలు
- విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన బీఆర్‌ఎస్ నేత
- ఈ ప్రతిఘటనను పది నెలల క్రితమే ఊహించినట్లు వెల్లడి
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యువత ఆవేదనను పట్టించుకోకపోతే దేశంలో ‘జెన్-జెడ్’ ఉద్యమం తప్పదని తాను పదినెలల కిందటే చెప్పానని గుర్తుచేశారు. ఢిల్లీలో జరిగిన నిరసనల తర్వాతైనా కేంద్రం జవాబుదారీతనం చూపించి, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది లాఠీలతో కాదని, రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు కల్పించిందని పేర్కొన్నారు. విభేదాల గొంతు నొక్కే ప్రయత్నాలను కేంద్రం వెంటనే ఆపాలని, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న విద్యార్థులకు తాను సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కూడా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులకు మద్దతు ప్రకటిస్తూ, పోలీసుల చర్యలను ఖండించారు.