Advertisement

గుడికి తీసుకెళ్తానని నమ్మించి ఘాతుకం.. నిర్మానుష్య భవనంలో తెల్లవార్లూ రాక్షసత్వం

Devanahalli Gang Rape 14 year old girl assaulted in isolated building after being lured to temple
  • 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
  • కర్ణాటకలోని దేవనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘాతుకం 
  • గుడి పేరుతో నమ్మించి తీసుకెళ్లిన మహిళ 
  • మద్యం తాగించి నిర్మానుష్య ప్రాంతంలో అఘాయిత్యం  
  • మహిళ సహా ముగ్గురు నిందితుల అరెస్ట్
కర్ణాటకలోని దేవనహళ్లిలో 14 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఉదంతం కలకలం రేపింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన నవీన్, వెంకటరమణ, రేణుక అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 17న నిందితురాలు రేణుక సదరు బాలికను దేవనహళ్లిలోని గుడికి తీసుకెళ్తానని నమ్మించి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లింది. ఆ తర్వాత బాలికను నవీన్, వెంకటరమణలకు అప్పగించింది. వారిద్దరూ బాలికను ఆటోలో మరొక ప్రాంతానికి తీసుకెళ్తూ, మార్గమధ్యంలో బలవంతంగా మద్యం తాగించారు.

మద్యం మత్తులో ఉన్న బాలికను ఇంటి వద్ద దించేందుకు ఆటోను నిలిపినప్పటికీ, తండ్రి తిడతాడనే నెపంతో ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అనంతరం నిర్మానుష్యంగా ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి, రాత్రంతా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. 

మరుసటి రోజు ఉదయం బాలికను ఇంటి వద్ద వదిలిపెడుతూ, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, ఉదయాన్నే ఇంటికి చేరిన బాలికను విచారించగా అసలు నిజం బయటపడింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దేవనహళ్లి పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు.
Advertisement
Devanahalli Gang Rape
Karnataka Crime News
Minor Girl Assault Case
Naveen and Venkataramana Arrest
Renuka Devanahalli Case
Karnataka Police Arrests

More Telugu News