గోషామహల్‌లో బీఆర్ఎస్‌ను గెలిపించి డబుల్ ఇంజిన్ తెలంగాణ సర్కార్ చేయండి: ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి
- రాజాసింగ్ తాను హిందువునంటూ రాజకీయం చేస్తాడు.. కేసీఆర్ అంతకంటే పెద్ద హిందువు అన్న కేటీఆర్
- గోషామహల్‌ను గచ్చిబౌలి తరహా తీర్చిదిద్దుతామని హామీ
- మార్వాడీలు ఒక్కసారి మీ సామాజిక వర్గానికి చెందిన బిలాల్‌ను గెలిపించాలని విజ్ఞప్తి
మార్వాడీలు ఒక్కసారి మీ సామాజిక వర్గానికి చెందిన బిలాల్‌ను గెలిపించుకోవాలని కోరారు. ఇదివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తమకు ఇవ్వండని కోరారు. నందకిషోర్ పాతికేళ్లుగా ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, కరోనా సమయంలో ఎంతోమందికి సేవలు అందించారన్నారు. తెలంగాణలో మూడోసారి తమ ప్రభుత్వం రాగానే హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అన్నారు. కోహ్లీ సెంచరీ కొట్టినట్లు బీఆర్ఎస్ సెంచరీ కొట్టాలంటే ఇక్కడి నుంచి నందకిషోర్‌ను గెలిపించాలన్నారు. మోదీ, అమిత్ షాలు చెప్పినట్లు గోషామహల్‌లో బీఆర్ఎస్‌ను గెలిపించి డబుల్ ఇంజిన్ తెలంగాణ సర్కార్ చేయాలన్నారు.