సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థుల్ని గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గమిదే!: తుమ్మల నాగేశ్వరరావు
- అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్న తుమ్మల
- ప్రజలకోసం చిత్తశుద్ధితో యజ్ఞంలా రాజకీయం చేశానని వ్యాఖ్య
- జనశక్తి ముందు వందల కోట్ల డబ్బులు ఏమీ చేయలేవన్న తుమ్మల నాగేశ్వరరావు
తన చిన్నప్పుడే ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేశానని చెప్పారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని, వాటి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. సత్తుపల్లి అభ్యర్థి మట్టా రాగమయిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పది రోజులు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కష్టపడాలని, ఆ తర్వాత ప్రజల కోసం మేం కష్టపడతామన్నారు. తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా అభిమానంతో రాజకీయం చేస్తున్నానన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ గెలుస్తుందని, 9వ తేదీన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.