కేసీఆర్‌కు ఓటమి తప్పదని అర్థమైంది... ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు: మల్లికార్జున ఖర్గే
- కేసీఆర్‌కు పదవీ విరమణ సమయం వచ్చేసిందన్న ఖర్గే
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ
- మోదీ, కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఆపలేరని వ్యాఖ్య
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొలి మంత్రివర్గంలోనే ఆమోదిస్తామని ఖర్గే చెప్పారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. బీఆర్ఎస్‌పై బీజేపీ నేతలు విమర్శలు తగ్గించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ పరస్పర విమర్శలు మానేశారన్నారు. వారిద్దరు కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా ఆపలేరన్నారు. బీఆర్ఎస్ మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని స్వయంగా చెప్పాడని, అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.