టీడీపీ విషయంలో నా అంచనా ఇదే: విజయసాయిరెడ్డి
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- తెలంగాణ టీడీపీలో భారీ కుదుపులు
- తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంలేదన్న టీడీపీ హైకమాండ్... కాసాని రాజీనామా
- టీడీపీ పతనానికి ఇది ప్రారంభం మాత్రమేనన్న విజయసాయి
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తెలంగాణలో అసలు ఎక్కడా పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించుకోవడం 1982 తర్వాత ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ పతనానికి ఇది ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు. "నా అంచనా ప్రకారం 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పూర్తిగా నిష్క్రమిస్తుంది" అని విజయసాయిరెడ్డి వివరించారు.