బీటెక్ పూర్తి చేశారా.. అయితే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మీకోసమే!
- టీఎస్ జెన్ కో లో 339 ఏఈ పోస్టులు
- నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ
- ఈ నెల 29 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన
ముఖ్యమైన వివరాలు..
పోస్టులు: అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)
ఖాళీలు: 339
జీతభత్యాలు: రూ.65,600 ప్రారంభ వేతనం, సీనియారిటీ పెరిగేకొద్దీ రూ.1,31,220
అర్హతలు: బీటెక్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్) ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 44 సంవత్సరాలు (రిజర్వేషన్లకు అనుగుణంగా మినహాయింపులు)
దరఖాస్తులు: అర్హతకల అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించి, ఆన్ లైన్ లో అక్టోబర్ 7 నుంచి దరఖాస్తు చేసుకోవాలి
చివరితేదీ: అక్టోబర్ 29
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
రాత పరీక్ష: డిసెంబర్ 3
పూర్తి వివరాల కోసం టీఎస్ జెన్ కో వెబ్ సైట్ ను సంప్రదించాలి