ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా
- ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం
- పొల్యూషన్ బోర్డుతో పాటు హెల్త్ వర్సిటీలో నియామకాలు
- మొత్తం 59 పోస్టుల భర్తీ చేపట్టాలంటూ ఆదేశం
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాల అమలు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పర్యవేక్షించడానికి సిబ్బంది కొరత ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యవసర సర్వీసుల కేటగిరీలో.. విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీలో ఖాళీల భర్తీకి అనుమతిచ్చినట్లు జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ల పోస్టులు (21), గ్రేడ్ -2 ఎనలిస్ట్‌ల పోస్టుల (18) ను భర్తీ చేయనున్నారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు (19), అసిస్టెంట్ లైబ్రేరియన్ (1) పోస్టులను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది.