పాకిస్థాన్ డిమాండ్ ను తోసిపుచ్చిన బీసీసీఐ, ఐసీసీ
- వన్డే ప్రపంచకప్ మ్యాచుల వేదికలు మార్చాలని కోరిన పీసీబీ
- బెంగళూరు, చెన్నై వేదికల్లో మ్యాచులను అటూ, ఇటూ మార్చాలని వినతి
- కుదరదని తేల్చి చెప్పిన బీసీసీఐ, ఐసీసీ
కానీ, పాక్ డిమాండ్ ను అటు ఐసీసీ, ఇటు బీసీసీఐ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. అక్టోబర్ 20న బెంగళూరులో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. అలాగే, 23న చెన్నైలో ఆఫ్ఘనిస్థాన్ ను ఎదుర్కోనుంది. కానీ, దీన్ని రివర్స్ చేయాలని పాక్ డిమాండ్ చేస్తోంది. బెంగళూరులో ఆప్ఘనిస్థాన్ తో.. చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని కోరింది. కానీ, పాకిస్థాన్ డిమాండ్ ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి. ఇదే నిర్ణయాన్ని మంగళవారం నాటి సమావేశం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కు తెలియజేశాయి. మరి చివరికి పాక్ వన్డే కప్ కోసం భారత్ కు వస్తుందా? లేదా? అన్నది చూడాలి.