పాము కాటు నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలిక.. వీడియో ఇదిగో!

పాము కాటు నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలిక.. వీడియో ఇదిగో!

karnataka girl escaped snake bite viral video
  • ఇంటి గుమ్మం దగ్గర బుసలు కొడుతున్న పాము
  • బయటి నుంచి వచ్చి ఇంట్లోకి వెళుతున్న బాలిక
  • కర్ణాటకలోని బెళగావిలో ఘటన.. సీసీటీవీలో రికార్డు
కర్ణాటకలో ఓ బాలిక త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పాము కాటు నుంచి కొద్దిలో బయటపడింది. ఇంటి గుమ్మం ముందున్న పామును బాలిక గమనించకుండా ఇంట్లోకి వెళుతుంటే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వాళ్లు అప్రమత్తం చేయడంతో బాలిక లోపలికి పరుగుతీసింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది.

బెళగావిలోని హలగా గ్రామంలో ఓ ఇంటి గుమ్మం ముందు పాము పాకుతూ వెళుతోంది. ఇది గమనించకుండా ఓ బాలిక మెట్ల పైనుంచి ఇంట్లోకి వెళుతోంది. గుమ్మం దగ్గరకు రాగానే పాము బెదిరిపోయి కాటేసేందుకు ప్రయత్నించింది. అయితే, బాలిక ముందుకు అడుగు వేయడంతో ముప్పు తప్పింది. ఈలోగా బాలిక లోపలికి వెళ్లకుండా గుమ్మం దగ్గరే ఆగడంతో పాము మరోమారు కాటేసేందుకు ప్రయత్నం చేసింది.

ఇంతలో ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు పామును గమనించి హెచ్చరించడంతో బాలిక దూరం జరిగింది. ఆపై పాము వెనక్కి తిరిగి వెళ్లడంతో బాలిక ఇంట్లోకి పరుగు తీసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Karnataka
Belagavi
snake
girl
cctv video
offbeat

More Telugu News