భారత్‌లో ఐదేళ్లు.. విదేశీ మహిళకు నచ్చిన మన దేశంలోని విషయాలివే!

భారత్‌లో ఐదేళ్లు.. విదేశీ మహిళకు నచ్చిన మన దేశంలోని విషయాలివే!

Five years in India things this foreign woman loves about our country
  • ఆహార వైవిధ్యం, పిల్లల పట్ల ఆప్యాయతపై క్రిస్టెన్‌ ప్రశంసలు
  • అపరిచితుల సాయం, వైద్య సేవలను మెచ్చుకున్న క్రిస్టెన్‌
  • ప్రశాంత జీవనశైలి, సులభమైన రవాణా సైతం నచ్చినట్లు వెల్లడి
  • వస్తువులను రిపేర్‌ చేసి మళ్లీ వాడే అలవాటును మెచ్చుకున్న క్రిస్టెన్‌
  • భారతీయ వివాహాలు, హోలీ వేడుకలపై ప్రత్యేక ప్రశంస
భారత్‌ను బయట నుంచి చూసేవారికి కనిపించేది ఒక రూపం. ఇక్కడ కొంతకాలం జీవిస్తే కనిపించేది మరో రూపం. ఐదేళ్లుగా భారత్‌లో నివసిస్తున్న క్రిస్టెన్‌ ఫిషర్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మన దేశంలో తనకు నచ్చిన కొన్ని విషయాలను ఆమె సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆమె చెప్పిన అంశాలు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రుచుల ప్రపంచం
భారత్‌లో ఆహార వైవిధ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని క్రిస్టెన్‌ చెప్పారు. రోజూ కొత్త వంటకాన్ని రుచి చూసేంత విస్తృతమైన ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. నలుగురు చిన్నారుల తల్లిగా పిల్లల పట్ల భారతీయులు చూపించే ఆప్యాయత తనకు ఎంతో నచ్చిందన్నారు. అపరిచితులు సైతం అవసరంలో సాయం చేయడం, ఆతిథ్యం ఇవ్వడం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు.

సౌకర్యంగా సాగే జీవితం
వైద్య సేవలు అందుబాటులో ఉండటం, తక్కువ ఖర్చుతో చికిత్స పొందే అవకాశం ఉండటం కూడా భారత్‌లో తనకు నచ్చిన అంశాల్లో ఒకటని క్రిస్టెన్‌ తెలిపారు. స్థానిక సమాజంలో ఒకరికొకరు అండగా నిలిచే తీరు తనకు నచ్చిందన్నారు. ఇక్కడి జీవనశైలి కూడా అంతగా ఉరుకులు పరుగులతో ఉండదని చెప్పారు. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు సులభంగా దొరకడం మరో సానుకూల అంశమన్నారు.

వాన చినుకుల నుంచి పండుగల వరకు
భారత్‌లో వర్షాకాలం తనకు ఎంతో ప్రత్యేకమని క్రిస్టెన్‌ చెప్పారు. ఉదయం వాన చప్పుడు, వర్షంతో పచ్చగా మారే చెట్లు, పిల్లలతో కలిసి వానలో నడవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని తెలిపారు. వస్తువులను పారేయకుండా మరమ్మతు చేసి మళ్లీ వాడే అలవాటు కూడా తనను ఆకట్టుకుందని చెప్పారు. చివరగా భారతీయ వివాహాలు, హోలీ వేడుకలు, పండుగల సందడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

ఆమె పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు యూపీఐ, 10 నిమిషాల డెలివరీ వంటి సౌకర్యాలను కూడా జాబితాలో చేర్చాలని సూచించారు. అయితే భారత్‌ను అనుభవించే తీరు ఆర్థిక స్థితిని బట్టి మారుతుందని కొందరు వ్యాఖ్యానించారు.
Advertisement
Kristen Fisher
Foreigners living in India
Indian food and culture
Indian hospitality and lifestyle
Affordable healthcare in India
Indian festivals and monsoons

More Telugu News