పాక్ లో జంట పేలుళ్లు.. 13 మంది దుర్మరణం
- స్వాత్ లోయను వణికించిన పేలుళ్లు
- కౌంటర్ టెర్రరిజం ఆయుధగారంపై దాడి
- పేలుళ్ల ధాటికి మరో 50 మందికి గాయాలు
తొలుత ఈ ఘటనను ఆత్మాహుతి దాడిగా పేర్కొన్న ప్రధాని.. ఘటనపై విచారణ జరిపిస్తామని, టెర్రరిజంపై పోరులో పాక్ పోలీసులు ముందుంటారని చెప్పారు. సోమవారం రాత్రి మరోమారు ట్వీట్ చేస్తూ.. ఈ పేలుళ్లకు కారణాన్ని గుర్తించేందుకు అధికారులు విచారణ చేస్తున్నారని ప్రధాని తెలిపారు.
కాగా, స్వాత్ లోయతో పాటు చుట్టుపక్కల ప్రాంతమంతా గతంలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల అధీనంలో ఉండేది. 2009లో మిలటరీ ఆపరేషన్ నిర్వహించి పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది. ఆ తర్వాత ఇక్కడ కౌంటర్ టెర్రరిజం ఆఫీసును, ఆయుధగారాన్ని ఏర్పాటు చేసింది. పోలీసులు, కౌంటర్ టెర్రరిజం ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం జరిగిన జంటపేలుళ్లు ఈ కౌంటర్ టెర్రరిజం ఆయుధగారాన్ని లక్ష్యంగా చేసుకున్నవేనని పోలీసులు తెలిపారు.