Andhra Pradesh: ఏపీ కేబినెట్ సమావేశం తేదీ ఖరారు

  • ఈ నెల 14న ఏపీ కేబినెట్ సమావేశం
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్ రెడ్డి
  • అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
AP Cabinet meeting on March 14

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతోంది. ఈ నెల 14న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీ సెక్రటేరియట్ లోని ఒకటో బ్లాక్ లో 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

More Telugu News