Ravi Venkateswara Rao: బాలకృష్ణ కాలి గోటికి కూడా కొడాలి నాని సరిపోడు: రావి వెంకటేశ్వరరావు

Kodali Nani is nothing before Balakrishna says Ravi Venkateswara Rao
  • హరికృష్ణ పేరు చెప్పుకుని లక్షలు దోచుకున్నారన్న రావి
  • ఏ అర్హతతో ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్న
  • విజయసాయి ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని ఆరోపణ
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ కాలిగోటికి కూడా కొడాలి నాని సరిపోడని ఆయన అన్నారు. సిగ్గు, లజ్జ లేకుండా బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పట్లో లక్ష్మీపార్వతి ఏం చేసిందో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, పార్టీ సీనియర్ నేతలందరికీ తెలుసని చెప్పారు. నందమూరి హరికృష్ణ పేరు చెప్పుకుని కొడాలి నాని లక్షలు దోచుకుతిన్నారని ఆరోపించారు. ఏ అర్హతతో ఎన్టీఆర్ కుటుంబం గురించి కొడాలి నాని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వెయ్యి కోట్ల అవినీతి సొమ్మును విశాఖలో పెట్టుబడిగా పెట్టారని అన్నారు. నాని పెట్టుబడులపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కొడాలి నానికి చరమగీతం పాడేందుకు గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దుర్మార్గుడైన నానిని నెహ్రూ సెంటర్ లో పాతేస్తానని చెప్పారు.
Ravi Venkateswara Rao
Balakrishna
Harikrishna
Telugudesam
Kodali Nani
Vijayasai Reddy
YSRCP

More Telugu News