Navin Jindal: ముస్లిం శక్తుల నుంచి నా కుటుంబానికి హాని ఉంది: నవీన్ జిందాల్

My family has threat from Muslim fundamentalists says Navin Jindal
  • మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీన్ జిందాల్
  • తన వివరాలను బహిర్గతం చేయవద్దని విన్నవించిన నవీన్
  • తన ఇంటి చిరునామాను చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆవేదన
మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ జిందాల్ ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వర్గం నుంచి తన కుటుంబానికి హాని ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయవద్దని కోరారు. 

తన గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ ఎవరూ కూడా ఎలాంటి వివరాలను ఎవరికీ చెప్పవద్దని విన్నవించారు. తన నివాస చిరునామాను చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారని చెప్పారు. ఇస్లామిక్ శక్తుల నుంచి తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు.
Navin Jindal
bjp
threat

More Telugu News