8 ఏళ్లుగా నడిపిన బస్సుకు డ్రైవర్ చివరి ముద్దు.. వైరల్‌గా మారిన ఎమోషనల్ వీడ్కోలు!
- కేఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌గా పాల్ కురియన్ 18 ఏళ్ల సేవ
- ఒకే బస్సును ఎనిమిదేళ్లుగా నడిపిన వైనం
- చివరి రోజు బస్సుకు ముద్దుపెట్టి వీడ్కోలు
- సహోద్యోగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- పాల్ వీడ్కోలుపై కేరళ సీఎం స్పందన
18 ఏళ్లుగా డ్రైవర్‌గా విధులు.. అందులో ఒకే బస్సును ఎనిమిదేళ్ల పాటు నడిపారు. రోజూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఆ బస్సుతో చివరి రోజు మాత్రం భావోద్వేగంగా వీడ్కోలు తీసుకున్నారు కేరళకు చెందిన పాల్ కురియన్. బస్సు వద్దకు వెళ్లి దానికి ముద్దుపెట్టి మరీ వీడ్కోలు చెప్పిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
8 ఏళ్ల అనుబంధం..
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ)లో పాల్ కురియన్ 18 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఇడుక్కి-కుమిలి మార్గంలో ఒకే బస్సును నడుపుతున్నారు. చివరి రోజు విధులు ముగించుకుని వెళ్లే ముందు.. ఆ బస్సు వద్దకు వెళ్లి దానిని ఆప్యాయంగా ముద్దుపెట్టి వీడ్కోలు చెప్పారు. ఈ దృశ్యాలను ఆయన సహోద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి.
సీఎం కూడా స్పందించారు..
పాల్ కురియన్ అధికారికంగా అక్టోబర్ 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అయితే మంగళవారమే ఆయన చివరి పని రోజు. ఆ తర్వాత రిటైర్మెంట్ వరకు సెలవులో ఉండనున్నారు. బస్సుకు పాల్ ఇచ్చిన వీడ్కోలు వీడియో కేరళ ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లింది. బస్సుకు గౌరవంగా వంగి వీడ్కోలు చెప్పిన పాల్ అభిమానం తనను కదిలించిందని సీఎం పేర్కొన్నారు. పాల్ లాంటి వేలాది కేఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల అంకితభావమే రాష్ట్ర ప్రజా రవాణాకు బలమని అన్నారు. కేఎస్‌ఆర్టీసీని ఆధునికీకరిస్తూనే.. ప్రజల జీవనాడిగా దాని పాత్రను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.