పిల్లల కోసం ప్రతిదీ ముందే చేసేస్తున్నారా? ఈ 5 అలవాట్లు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారొచ్చు!
- పిల్లల ప్రతి సమస్యను తల్లిదండ్రులే పరిష్కరించడమే లాన్‌మోవర్ పేరెంటింగ్
- చిన్న వైఫల్యాలతో పిల్లలకు విలువైన పాఠాలు
- ప్రతి విషయంలో పిల్లల తరఫున మాట్లాడటం మంచిది కాదు
- చిన్న అసౌకర్యాలు ఎదుర్కోవడం కూడా ఎదుగుదలలో భాగమే
- పిల్లల సమస్యలను పరిష్కరించడం కంటే పరిష్కారం వెతకడం నేర్పాలి
పిల్లలు కష్టపడుతుంటే తల్లిదండ్రులు చూడలేరు. అందుకే వాళ్ల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వస్తుంటారు. హోంవర్క్ మర్చిపోయినా, తక్కువ మార్కులు వచ్చినా, స్నేహితుడితో గొడవ జరిగినా.. సమస్యను మనమే పరిష్కరించేస్తే పిల్లలకు ఇబ్బంది ఉండదనుకుంటాం. కానీ ప్రతిసారీ పిల్లల దారిలోని అడ్డంకులను తల్లిదండ్రులే తొలగిస్తే.. వారు స్వయంగా సమస్యలను ఎదుర్కోవడం ఎప్పుడు నేర్చుకుంటారు? ఈ తరహా పేరెంటింగ్‌నే ‘లాన్‌మోవర్ పేరెంటింగ్’ అంటారు. గడ్డిని కోసుకుంటూ ముందుకు వెళ్లే లాన్‌మోవర్‌లా.. పిల్లల దారిలోని ప్రతి కష్టాన్ని ముందుగానే తొలగించడం దీని లక్షణం. మీలో ఈ 5 అలవాట్లు ఉన్నాయా చూసుకోండి..
1. పిల్లలు ప్రయత్నించేలోపే పరిష్కరిస్తున్నారా?
పిల్లలు స్నేహితుడితో గొడవపడ్డారని వెంటనే వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం, అసైన్‌మెంట్ కష్టంగా ఉందని మీరే పూర్తి చేయడం వంటివి లాన్‌మోవర్ పేరెంటింగ్‌కు ఉదాహరణలు. సమస్య వచ్చినప్పుడు ముందుగా “నువ్వు ఏమైనా చేయగలవా?” అని పిల్లల్నే ఆలోచించేలా చేయడం మంచిది.
2. పిల్లల ఓటమిని మీరు తట్టుకోలేకపోతున్నారా?
తక్కువ మార్కులు రావడం, డెడ్‌లైన్ మిస్ కావడం, ఏదైనా మర్చిపోవడం చూసి వెంటనే జోక్యం చేసుకోకండి. వయసుకు తగిన చిన్న తప్పులు, వైఫల్యాలు పిల్లలకు మంచి పాఠాలు నేర్పుతాయి. తప్పు నుంచి నేర్చుకునే అవకాశం ఇవ్వాలి.
3. పిల్లల తరఫున మీరే ప్రతిసారీ మాట్లాడుతున్నారా?
పిల్లలకు సమస్య వచ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులే మాట్లాడటం వల్ల.. తమ అభిప్రాయాన్ని చెప్పడం, సమస్యను వివరించడం వంటి నైపుణ్యాలు పిల్లల్లో పెరగవు. అవసరమైనప్పుడు అండగా నిలవాలి కానీ, ప్రతి సందర్భంలో పిల్లల తరఫున మనమే మాట్లాడకూడదు.
4. ప్రతి అసౌకర్యం నుంచి కాపాడుతున్నారా?
ఆటలో ఓడిపోవడం, స్నేహితుడితో అభిప్రాయ భేదం రావడం, కొత్త విషయం నేర్చుకుంటూ విసుగు చెందడం.. ఇవన్నీ జీవితంలో సహజమే. ప్రతి చిన్న ఇబ్బందికీ తల్లిదండ్రులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి అనుభవాలే నిరాశను తట్టుకోవడం, ఓటమిని అంగీకరించడం నేర్పుతాయి.
5. పిల్లలు స్వయంగా చేయగల పనులను కూడా మీరే చేస్తున్నారా?
స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవడం, చిన్న నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను పిల్లలే చేయనివ్వాలి. తల్లిదండ్రులు వాటిని వేగంగా లేదా మెరుగ్గా చేయగలిగినా.. పిల్లలకు స్వయంగా ప్రయత్నించే అవకాశం ఇవ్వడం మరింత ముఖ్యం. పిల్లలను కాపాడటం ఎంత ముఖ్యమో.. సమస్యలను ఎదుర్కొనేలా తయారు చేయడం కూడా అంతే ముఖ్యం.