Somu Veerraju: పోలీసులపై సోము వీర్రాజు ఉగ్ర నరసింహావతారం... వీడియో ఇదిగో!

Somu Veerraju fires on police
షార్ట్స్‌లో చూడండి
అమలాపురం వెళుతుండగా తన వాహనాన్ని పోలీసులు ఆపడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ ఎస్సైని నెట్టివేస్తూ తీవ్ర ఆవేశం ప్రదర్శించారు. నువ్వెవరివి నన్ను ఆపడానికి? నన్ను ఆపమని నీకు చెప్పింది ఎవరు? అంటూ ఆ పోలీసు అధికారిపై మండిపడ్డారు. మీతో నేను మాట్లాడను... నేను ఎస్పీతో మాట్లాడతా! అంటూ తీవ్రస్వరంతో వాగ్యుద్ధానికి దిగారు. 

అంతేకాదు, తన కారుకు అడ్డంగా నిలిపిన కంటైనర్ వాహనం డ్రైవర్ పైనా "ఇడియట్" అంటూ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. కంటైనర్ వాహనానికి పోలీసులు అడ్డు నిలబడగా, సోము వీర్రాజు కంటైనర్ డ్రైవర్ పై ఆగ్రహం ప్రదర్శించారు. పోలీసులు అడ్డు తొలగందే తానెలా ముందుకు పోగలనంటూ ఆ డ్రైవర్ నిస్సహాయత వ్యక్తం చేశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Somu Veerraju
Police
Anger
Jonnada
Amalapuram
BJP

More Telugu News