పేదలకు డబ్బిస్తే వాళ్లు సోంబేరులుగా మారుతారని అనడం దారుణం: ఎంపీ నందిగం సురేశ్
- గత ప్రభుత్వాల హయాంలో అగ్ర కులాలకు మాత్రమే పథకాలు అందేవన్న సురేశ్
- జగన్ పాలనలో అందరికీ అందుతున్నాయని వ్యాఖ్య
- ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదని విమర్శ
ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని... అందుకే ఇంటింటికి తిరిగి అందరూ కలిసి రండి అని అడుక్కుంటున్నారని నందిగం సురేశ్ అన్నారు. దత్తపుత్రుడితో కలిసి కుయుక్తులు పన్నుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసొచ్చినా జగన్ ను ఎదుర్కోలేరని అన్నారు.