కెనడాలో భారత కీర్తి పతాక.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్‌గా అనహత్
- వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ గెలిచిన అనహత్ సింగ్
- ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డ్
- ఫైనల్‌లో ఈజిప్ట్ క్రీడాకారిణిపై వరుస గేముల్లో విజయం
- 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈజిప్ట్ ఆధిపత్యానికి తెరదించిన అనహత్
భారత యువ స్క్వాష్ సంచలనం అనహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. కెనడాలోని నియాగరా-ఆన్-ది-లేక్‌లో శనివారం జరిగిన మహిళల ఫైనల్‌లో ఆమె ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
టాప్ సీడ్, వరల్డ్ నంబర్ 20 అయిన అనహత్, ఫైనల్‌లో ఈజిప్టుకు చెందిన రెండో సీడ్ రుఖయ్యా సలేంను 11-3, 11-7, 11-9 తేడాతో వరుస గేముల్లో ఓడించింది. గత ఏడాది ఇదే టోర్నీలో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న అనహత్, ఈసారి అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో 15 ఏళ్లుగా ఈ టోర్నీలో కొనసాగుతున్న ఈజిప్టు క్రీడాకారుణుల ఆధిపత్యానికి అనహత్ తెరదించింది. 2010 తర్వాత ఈ టైటిల్ గెలిచిన తొలి నాన్-ఈజిప్షియన్ ప్లేయర్‌గా కూడా ఆమె నిలిచింది.
శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో ఈజిప్టుకే చెందిన బార్బ్ సమీహ్‌ను ఓడించిన అనహత్, 21 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలిగా నిలిచింది. "ఫైనల్‌కు చేరడం నా తల్లిదండ్రులకు, కోచ్‌లకు చాలా ఆనందాన్నిచ్చింది. కానీ టోర్నమెంట్ ఇంకా ముగియలేదు" అని సెమీస్ అనంతరం ఆమె వ్యాఖ్యానించింది. చెప్పినట్టుగానే ఫైనల్లోనూ గెలిచి తన కెరీర్‌లోనే అతిపెద్ద టైటిల్‌ను సొంతం చేసుకుంది.