'మా అబ్బాయి వస్తున్నాడు.. ఆదరించండి'..! జయకృష్ణ కోసం మహేశ్ బాబు ఎమోషనల్ అప్పీల్.. వీడియో వైరల్!
- అన్న రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ కోసం మహేశ్ బాబు ప్రచారం
- 'శ్రీనివాస మంగాపురం' సినిమాకు మద్దతుగా ప్రత్యేక వీడియో విడుదల
- తన 'రాజకుమారుడు' రిలీజ్ డేట్‌నే అబ్బాయ్‌కి కుదిరిందంటూ ఆనందం
- జయకృష్ణను ఆదరించాలని తన అభిమానులను కోరిన సూపర్ స్టార్
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అవుతున్న వేళ, సూపర్ స్టార్ మహేశ్ బాబు తన పూర్తి మద్దతు ప్రకటించారు. తన అన్నయ్య రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా నటిస్తున్న 'శ్రీనివాస మంగాపురం' సినిమా కోసం మహేశ్ ఒక ప్రత్యేక వీడియోను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు. తన అబ్బాయ్ జయకృష్ణను ఆశీర్వదించాలని ఆయన అభిమానులను కోరారు.
ఈ వీడియోలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. "మా అన్నయ్య అబ్బాయి జయకృష్ణ నటుడిగా పరిచయం అవుతుండటం చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబమంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తోంది. సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బాగున్నాయి. జయకృష్ణ, రాషా థడానీ జంట చూడముచ్చటగా ఉంది. వారిని అందంగా చూపించిన దర్శకుడు అజయ్ భూపతికి నా అభినందనలు" అని అన్నారు.
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మహేశ్ పంచుకున్నారు. "ఈ సినిమా జులై 30న విడుదలవుతోంది. అదే రోజు నా మొదటి సినిమా 'రాజకుమారుడు' కూడా విడుదలైంది. నిర్మాత అశ్వినీదత్ గారే ఈ డేట్ ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. వైజయంతి సంస్థ నుంచి నేను, రామ్ చరణ్, అల్లు అర్జున్ వచ్చాం. ఇప్పుడు జయకృష్ణ, రాషా కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నారు. ఇది వాళ్ల అదృష్టం. మా నాన్నగారి అభిమానులు, నా అభిమానులు జయకృష్ణ, రాషాలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని మహేశ్ తెలిపారు.
'RX100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అశ్వినీ దత్ సమర్పణలో జెమినీ కిరణ్ నిర్మించారు. ప్రస్తుతం మహేశ్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.