వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ స్పందన
- పొత్తికడుపు సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న వైఎస్ షర్మిల
- తాను కోలుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడి
- షర్మిల ఆరోగ్యంపై స్పందించిన మంత్రి నారా లోకేశ్
- ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై లోకేశ్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. షర్మిల వేగంగా కోలుకుంటున్నారని తెలిసి సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
"షర్మిల గారూ, మీరు త్వరగా కోలుకుంటున్నారని తెలిసి సంతోషంగా ఉంది. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తలు తీసుకోండి" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు షర్మిల చేసిన ట్వీట్‌ను ఆయన రీపోస్ట్ చేశారు.
ఇటీవల వైఎస్ షర్మిల పొత్తికడుపు సంబంధిత సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. "అవసరమైన ఉదర శస్త్రచికిత్స నుంచి నేను బాగా కోలుకుంటున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మీ అందరి ప్రార్థనలకు, మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పైనే నారా లోకేశ్ స్పందించి, ఆమెకు ఆరోగ్య పరామర్శ తెలియజేశారు.