హార్దిక్ పాండ్యా కోసం చెన్నై భారీ ఆఫర్.. ముంబై ఇండియన్స్ మెగా డిమాండ్
- ఐపీఎల్ 2027కు ముందు హార్దిక్‌ను దక్కించుకునేందుకు చెన్నై ప్రయత్నాలు
- ఆయుశ్ మాత్రే, శివమ్ దూబేలను డిమాండ్ చేస్తున్న ముంబై ఇండియన్స్
- మాత్రేను ఇచ్చేందుకు నిరాకరించి.. దూబే, బ్రెవిస్‌లను ఆఫర్ చేసిన చెన్నై
- దూబే, బ్రెవిస్‌తో పాటు రూ.10 కోట్లు నగదు ఇచ్చేందుకు సీఎస్కే ప్రతిపాదన
- చర్చలు విఫలమైతే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్న కేకేఆర్
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, ఈ మెగా ట్రేడింగ్ వ్యవహారంలో రెండు ఫ్రాంచైజీల మధ్య ఆసక్తికరమైన బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ భారీ ప్యాకేజీని డిమాండ్ చేస్తుండగా, చెన్నై అందుకు భిన్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది.
'హిందుస్థాన్ టైమ్స్' కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యాకు బదులుగా తమకు యువ సంచలనం ఆయుశ్ మాత్రేతో పాటు విధ్వంసకర ఆల్‌రౌండర్ శివమ్ దూబేను ఇవ్వాలని ముంబై ఇండియన్స్ కోరినట్లు సమాచారం. గత ఐపీఎల్ సీజన్లో దాదాపు 180 స్ట్రైక్ రేట్‌తో అదరగొట్టిన 19 ఏళ్ల మాత్రేను తమ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా కీలక ఆటగాడిగా ముంబై భావిస్తోంది. అందుకే అతడిని ట్రేడింగ్‌లో చేర్చాలని పట్టుబడుతోంది.
అయితే, భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతాడని భావిస్తున్న ఆయుష్ మాత్రేను వదులుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఎంతమాత్రం సుముఖంగా లేదు. అతడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముంబైకి మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రతిపాదించింది. ఈ కౌంటర్ ఆఫర్లో భాగంగా శివమ్ దూబే, దక్షిణాఫ్రికా డైనమిక్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌లతో పాటు అదనంగా రూ.10 కోట్ల నగదును ముంబైకి ఇచ్చేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ముంబై ఇండియన్స్‌కు సుమారు రూ.20 కోట్ల విలువైన ప్రయోజనం చేకూరవచ్చు. పేస్ బౌలింగ్ చేయగల భారత మిడిల్ ఆర్డర్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ చాలా అరుదైన ఆటగాడు. అయినప్పటికీ ఐపీఎల్ 2026లో అతను కేవలం 206 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీయడంతో అతని ఇటీవలి ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ఒకవైపు తమ యువ ప్రతిభను కాపాడుకోవాలని చెన్నై, మరోవైపు అత్యధిక ప్రయోజనం పొందాలని ముంబై పట్టుబట్టడంతో ఈ ట్రేడింగ్ చర్చలు ప్రతిష్టంభనలో పడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య ఒప్పందం కుదరకపోతే పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వంటి ఇతర ఫ్రాంచైజీలు హార్దిక్‌ను దక్కించుకునేందుకు పోటీలో నిలిచే అవకాశం ఉంది.